రేపు వాయుగుండం.. పిడుగులతో కూడిన వర్షాలు

29937చూసినవారు
రేపు వాయుగుండం.. పిడుగులతో కూడిన వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా బలపడనుందని ఐఎండీ వెల్లడించింది. ఇది రెండు రోజుల్లో తుఫానుగా మారనుందని తెలిపింది. దీని ప్రభావంతో నేటి నుంచి 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయంది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

ట్యాగ్స్ :