టీడీపీకి ఓటేశారని.. రేషన్ నిలిపివేత

51చూసినవారు
టీడీపీకి ఓటేశారని.. రేషన్ నిలిపివేత
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి రేషన్ దుకాణ డీలర్ నిత్యావసరాలు పంపిణీ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వైసీపీ నేత అయిన డీలర్.. ‘వైసీపీ ప్రభుత్వంలో కార్డుదారులంతా అనేక ప్రయోజనాలు పొందారు. వైసీపీకి ఓట్లు వేయకుండా పార్టీని ఓటించి మోసం చేశారు. నాకు తీరిక ఉన్నప్పుడు ఇస్తా. వెళ్లండి ఇక్కడి నుంచి.’ అంటూ దబాయిస్తున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్