శాన్‌ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేశ్‌కు అపూర్వ స్వాగతం

70చూసినవారు
శాన్‌ఫ్రాన్సిస్కోలో మంత్రి లోకేశ్‌కు అపూర్వ స్వాగతం
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. వారం రోజుల పర్యటనలో భాగంగా తొలుత శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్న ఆయనను విమానాశ్రయంలో టీడీపీ ఎన్‌ఆర్ఐ విభాగం అధ్యక్షుడు కోమటి జయరాం నేతృత్వంలోని టీడీపీ నేతలు అపూర్వ స్వాగతం పలికారు. నవంబర్ 1 వరకు మంత్రి లోకేశ్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెల 29న లాస్ వేగాస్‌లో ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్