యాపిల్ ఐఫోన్ 16పై ఇండోనేషియా నిషేధం విధించింది. ఇండోనేషియాలో ఐఫోన్ కంపెనీ 1.71 మిలియన్లను పెట్టుబడి పెడతామని చెప్పి, 1.48 మిలియన్లను మాత్రమే ఇన్వెస్ట్ చేసింది. ఆ బాధ్యతను మర్చిపోవడంతో ఈ ఫోన్ విక్రయాలు, వినియోగంపై ఆంక్షలు పెట్టింది. ఇతర దేశాల్లో కొని ఆ దేశంలో వాడడంపైనా నిషేధం విధించింది. దీంతో పర్యాటకానికి ఆ దేశం వెళ్దామని భావిస్తున్న టూరిస్టులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.