
పార్వతీపురం: విద్యార్ధులు మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలకు వెళ్లే విద్యార్థులందరూ తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అభిలషించారు. జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని బస్సుకు జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు.