కురుపాం: మండల సర్వసభ్య సమావేశంలో గరం గరం
పనితీరు మార్చుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కురుపాం మండల వ్యవసాయాధికారి కె. నాగేశ్వరరావుపై ఎంపిపి శెట్టి పద్మావతి, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎంపిడిఒ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం అందించకుండా ఎఒకు నచ్చినట్టు వ్యవహరించడం సమంజసం కాదని ఎంపిపి మండిపడ్డారు.