మెంటాడ మండలం జయితి గ్రామ పంచాయతీ పరిధిలో గల బిరసాడవలస గ్రామంలో సోమవారం ఎంపీడీవో పాండ్రంకి త్రివిక్రమరావు గ్రామసభ నిర్వహించారు. ప్రధాన మంత్రి జన్ మన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పోడు పట్టాలు 12మందికి లేవని, నలుగురికి బ్యాంకు ఖాతాలు లేవని, ఏడుగురికి, ఇంటి పట్టాలు ముగ్గురికి లేనట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.