Apr 26, 2025, 07:04 IST/
నేను ఇప్పుడు భారత్ కోడలిని: సీమా హైదర్
Apr 26, 2025, 07:04 IST
భారత్లో ఉన్న పాకిస్తానీయులు వెంటనే దేశం విడిచివెళ్లాలంటూ కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీమా హైదర్ వెళ్తుందా లేదా అంటూ నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. దీనిపై సీమా స్పందిస్తూ.. తానిప్పుడు భారతదేశపు కోడలినని, తనని వెళ్లగొట్టొదంటూ కోరుతోంది. తనకు పాక్ వెళ్లే ఉద్దేశం లేదని, ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలకు విజ్ఞప్తి చేస్తోంది. కానీ నెటిజన్లు మాత్రం ఆమెను తరిమేయాలని డిమాండ్ చేస్తున్నారు.