బలిజపెట పీహెచ్సిలో ఎమ్మెల్యే బోనేల విజయ చంద్ర
బలిజిపేట ప్రాధమిక కేంద్రానికి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా సౌజన్యనతో కొనుగోలు చేసిన రూ. 7, 99, 676/-ల విలువ గల వైద్య పరికరాలు మంగళవారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో బ్యాంకు అధికారులకు ఆయన సభాముఖంగా అభినందనలు తెలియజేసారు. రోగులకు అవసరమైన విశ్రాంతి కుర్చీలు, రెండు కంప్యూటర్లు, ఫ్రిడ్జ్, స్ట్రెచర్లు, టేబులళ్ళు, కుర్చీలు బ్యాంకు సిబ్బంది అందజేశారు.