కూలిన కల్వర్టు పనులు పరిశీలన

2573చూసినవారు
కూలిన కల్వర్టు పనులు పరిశీలన
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో ఇటీవల కురిసిన బారీ వర్షాలకు మండల కేంద్రమైన మెరకముడిదాం గాదెలమర్రివలస రోడ్డు లో కూలిన కల్వర్టును జిల్లా పరిషత్ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. గుంటూరులో శనివారం జరిగిన ప్లీనరి కార్యక్రమం ముగించిన వెంటనే గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు కల్వర్టులను మండల వైకాపా అధ్యక్షులు తాడ్డివేణుగోపాలరావు, మండల వైకాపా నేతలతో పాటు ఆయన పరిశీలించారు. కల్వర్టు దగ్గర నుండే సంబంధిత అధికారులతో మాటాడి కల్వర్టు నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్