
వాల్తేరు డివిజన్ లో పలు రైళ్లు రద్దు
తూర్పు కోస్తా రైల్వే పరిధి వాల్తేరు డివిజన్ లో నిర్వహణ కారణాల వలన పలు రైళ్ళను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్ డిసిఎం కే. సందీప్ మంగళవారం తెలిపారు. రైలు నెంబర్లు 07468/69 విశాఖ విజయనగరం మేము ఈనెల 26 నుంచి వచ్చే ఫిబ్రవరి 28, విజయనగరం విశాఖ ఈనెల 27 నుంచి మార్చి 1, రైలు నెంబర్ 07470/71 విశాఖ పలాస ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు రైళ్ళ రద్దును గమనించాలని కోరారు.