వైయస్సార్ ప్రభుత్వంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మారుమూడి విక్టర్ ప్రసాద్ పదవి పొంది ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు విజయనగరం అంబేద్కర్ భవన్లో సమతా సైనిక దళ్ సభ్యులుమొదటి పదవీ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నమస్కారించుకున్నారు. జిల్లా సైనికదల్ అద్యక్షులు దుర్గప్రసాద్ మాట్లాడుతూ విక్ట్ ర్ ప్రసాద్ ఎస్సి ల కోసం ఎంతో కృషి చేశారని, ఆయన లాగే సమతా సైనిక దల్ కార్యకర్తలందరూ దళితులపై జరుగుతున్న అన్యాయాల కోసం న్యాయం చేసే విధంగా కృషి చేయలని చెప్పారు. జిల్లా అధికార ప్రతినిధి అశోక్ అంబేద్కర్ గారు మాట్లాడుతూ నియోజకవర్గ బాధ్యులు మండల బాధ్యులు సమర్థవంతంగా పనిచేసి సమతా సైనిక్ దళ్ సంఘాన్ని అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరరావు గారు శ్రీనివాస్ పాల్గొన్నారు.