కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లో నూతన పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లోని మాధవ్ టైగర్ రిజర్వ్‌ను పులుల అభయారణ్యంగా ప్రకటిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో దేశంలో పులుల అభయారణ్యాల సంఖ్య 58కి చేరుకుంది. పులుల సంఖ్యను పెంచడమే ధ్యేయంగా ఈ టైగర్ రిజర్వ్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.