AP: ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల అమలులో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాల అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ సమీక్ష ఉండనుంది. కాగా, ప్రతివారం నాలుగు శాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.