భూమి పైకి రానున్న సునీతా విలియమ్స్.. ఎప్పుడంటే

82చూసినవారు
భూమి పైకి రానున్న సునీతా విలియమ్స్.. ఎప్పుడంటే
అమెరికాకు చెందిన సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ గతేడాది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రలోకి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వీరు ప్రయాణించిన బోయింగ్ స్టార్‌లైనర్‌ రాకెట్‌లో సమస్యలు తలెత్తడంతో తొమ్మిది నెలలుగా అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో వీరిద్దరిని భూమి పైకి తీసుకొచ్చేందుకు నాసా చర్యలు చేపట్టింది. మార్చి 16న ఇద్దరిని తిరిగి భూమికి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్