దత్తిరాజేరు మండలం దాస్ పేట గ్రామానికి చెందిన రాపాక సత్యం శుక్రవారం నాడు గుండెపోటుతో మరణించారు ఈ విషాద విషయాలు తెలుసుకున్న తోటి గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కలిసి ఆదివారం ఉదయం మృతుడు తండ్రి రాపాక పైడ్రాజుకు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అంతేకాకుండా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.