గంట్యాడ: వరి పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

82చూసినవారు
గంట్యాడ: వరి పంటలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు
గంట్యాడ మండలంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి టి రామారావు బుధవారం పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన బుడతనాపల్లిలో వరి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. రెక్క రాల్చు పురుగు సోకిన పంటలను పరిశీలించి నివారణ చర్యలను రైతులకు వివరించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఏ డి ఏ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్