విజయనగరం జిల్లాలోని గుర్ల గ్రామంలో ప్రభలిన అతిసార వ్యాధి మరణాలతో మెంటాడ మండల తహసీల్దార్ శ్రీనివాసరావు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెంటాడ తహసిల్దార్ కోరాడ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి గురువారం జయితి గ్రామంలో పర్యటించారు. మురుగు కాలువలు, అపరశుద్యాన్ని పరిశీలించారు.రక్షిత నీటి పథకాన్ని కూడా తనిఖీ చేశారు. గ్రామస్తులు ఆరోగ్యకర వాతావరణంలో జీవించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించామన్నారు.