ప్రకృతి వ్యవసాయం ప్రక్రియలో రైతులకు అవగాహన
గరివిడి మండలం, గెడ్డపువలస యూనిట్, చందాపురం గ్రామం, జగన్నాధపురం గ్రామాలలో ఆదివారం మాస్టర్ ట్రైనర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ కౌశల్ రావు, ఫీల్డ్ రిసోస్ పర్సన్ జ్యోతి బాబు రావడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకొని వెళ్లే ప్రక్రియలో రైతులు ఎదుర్కొనే సమస్యలు, ఏమైనా లోటు పాట్లు ఉన్నాయా అని రైతులతో మీటింగ్ పెట్టి స్వయంగా తెలుసుకోవడం జరిగింది.