కరోనాపై అవగాహన సదస్సు
విజయనగరం జిల్లా గరివిడి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కరోనా వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధికారి జి.భాస్కర్ రావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ దీప్తి హాజరయ్యారు. మహిళా సంఘాల లీడర్లకు గ్రామ సమాఖ్య సభ్యులకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. కరోనా వైరస్ వ్యాధి రాకుండా వ్యాధి లక్షణాలను వ్యాధి వ్యాపించే విధానం సభ్యులందరికీ డాక్టర్ దీప్తి వివరించారు. వైయస్సార్ క్రాంతి పదం ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో గ్రామ సమాఖ్య సభ్యులు ఇంటింటికి వెళ్లి కరోనా వైరస్ పై అందరికీ అవగాహన పరచాలని సూచనలు ఇచ్చారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో బాధ పడితే వారిని ఆరోగ్య కేంద్రాలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాలు వెలుగు ఏపీఎం పద్మ, గ్రామ సమాఖ్య సభ్యులు, ఆరోగ్య కేంద్రం సభ్యులు హాజరయ్యారు.