చీపురుపల్లి మండలం అలజంగి, గ్రామంలో అంబేద్కర్ గ్రంథాలయం, ఆశయ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల్ని పంపిణీ చేయడం జరుగుతుందని అలాగే ఈ సంవత్సరం కూడా 100 విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రఘమండ త్రినాథ్రావు మాజీ సర్పంచ్ వైఎస్సార్ పార్టీ నాయకులు మాట్లాడుతూ...ప్రజలు పర్యవరణా పరిక్షించే విధంగా పండగలు జరుపుకోవాలని, అందరూ మట్టి వినాయకుల్ని పూజించాలని, చెరువులో నీటి కాలుష్యం కాకుండా అందరూ పర్యావరణాన్ని కోసం మట్టి వినాయకుణ్ని పూజించాలని అన్నారు.
రఘమండ త్రినాథ్, మాజీ సర్పంచ్ వైఎస్సార్ పార్టీ నాయకులు, ఆశయ సంస్థ అధ్యక్షులు రెడ్డి రమణ, గ్రంథాలయం అధ్యక్షులు బి.కిశోర్ కుమార్ 100 మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా.బి.ఆర్ అంబెడ్కర్ గ్రంధాలయ అధ్యక్షులు బి.కిషోర్ కుమార్ సచివాలయం సేక్రటరీ షేక్ ఆహ్మద్ మహిళా పోలీస్ సి.హెచ్.గౌతమి, విద్యా కమిటీ చైర్మన్ మీసాల బలరాం, గ్రామ వాలంటిర్ బాలి.సత్యనారాయణ, బవిరి తిరుపతిరావు, బోనెల జాన్, సాయి తదితరులు పాల్గొన్నారు.