మక్కువ: సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం డి. శిర్లామ్ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో "పొలం పిలుస్తోంది" కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్, రభి పంటలపై సూచనలు చేస్తూ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. సుడిదోమ నివారణకు తుటికాడ కషాయం తయారు చేసి, దాని ప్రయోజనాలు వివరించారు. రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.