వైసిపి సోషల్ మీడియా సభ్యులు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కోరారు. నెల్లిమర్ల మండలం రామతీర్థంలో గురువారం సోషల్ మీడియా సభ్యులకు ఐడి కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సోషల్ మీడియా సభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. నాయకులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.