భామిని మండలంలోని కాట్రగాఢ బిలో కొలువైన శివాలయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమయ్యింది. మంగళవారం ఉదయం శివలింగాన్ని సూర్యకిరణాలు స్పర్శించాయి. ఈ శివాలయంలో సూర్యకిరణాలు ముందుగా నందేశ్వర కొమ్ములను తాకిన అనంతరం శివలింగాన్ని పూర్తి స్థాయిలో సూర్యకిరణాలు స్పర్శించటం అద్భుతమైన ఘట్టమని తవుడు గురుస్వామి పేర్కొన్నారు. ప్రతీ ఏటా కార్తీక మాసంలో శివలింగాన్ని సూర్యకిరణాలు స్పర్శిస్తుంటాయని తవుడు గురుస్వామి తెలిపారు.