వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే కళావతి
పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డుపై విషం చిమ్ముతూ వివాదం సృష్టించిన కూటమి ప్రభుత్వమేనని పాలకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, కూటమి ప్రభుత్వ పాపాలను కడిగేందుకు శనివారం అన్ని ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయాలని వైసీపీ పార్టీ శ్రేణులకు వండువ గ్రామంలోని తన క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం పిలుపునిచ్చారు.