రామభద్రపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన రామభద్రపురం మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రామభద్రపురం గ్రామంలోని శ్రీరాంనగర్ కాలనీకు చెందిన కోడూరు షణ్ముఖరావు(28) గురువారం రాత్రి బైకుపై అత్తారింటికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్ ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన షణ్ముకరావును విశాఖ కేజీహెచ్ లో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.