రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ కు క్రీడాకారులు ఎంపిక
ఈ నెల 13, 14, 15 తేదీలలో తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు రామభద్రపురం మండలం భూశాయవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు డి. సురేష్, బి. అంజలి ఎంపికైనట్లు పిడి యమ్.రామినాయుడు తెలిపారు. ఇటీవల జరిగిన అండర్ -16 జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టీం కు ఎంపికలో వీరు ఎంపికైనట్లు చెప్పారు. అదేవిధంగా అన్నవరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు.