రామభద్రపురం మండల పరిధి ఆరికతోటలో జడ్పీ స్కూల్ సమీపంలో డా. బి. ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా నిర్వహించనునట్లు ఆ సంఘ దళిత నాయకులు తెలిపారు. ముఖ్య అతిథులుగా బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే బేబీ నాయన, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రానున్నట్లు తెలిపారు.