శృంగవరపుకోట మండలం, కొట్టాం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి కొట్టాం గ్రామ దేవత అయినటువంటి కోటమ్మ తల్లి అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ద్వారా అమ్మవారికి బాబు గోత్రనామాలుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శృంగవరపుకోట
టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జీ. ఎస్. నాయుడు,కార్యకర్తలు, మహిళలు, యువత మరియు తదితరులు పాల్గొన్నారు.