
ఉత్తరాపల్లి గ్రామ రెవెన్యూ సదస్సు రసా- భాసా
కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామ రెవెన్యూ సదస్సు మంగళవారం రసా- భాసా మారింది. రింగురోడ్డు గాంధీ నగరం సమీపంలోనే రావడంతో ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో చాలామంది ఇల్లులు కోల్పోవడంతో ఆ దళిత కుటుంబాలు పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా మారింది. క్లెయిమ్ విషయంలో కూడా తేడాలు రావడంతో గ్రామ సదస్సులో ఎమ్మార్వోని నిలదీశారు. పునరావాసము కల్పించాలని ఎమ్మార్వోకు గాంధీ నగర దళిత కుటుంబాలు మొరపెట్టుకున్నారు.