డెంకాడ మండలం లో గల గ్రీన్ అంబాసిడర్ కార్మికులు జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై మండల సీఐటీయూ అధ్యక్షులు బచ్ఛల సూర్యనారాయణ ఆధ్వర్యంలో గ్రీన్ అంబాసిడర్ కార్మికులు వినతి పత్రం ను మండల అభివృద్ధి అధికారినికి సమర్పించారు. సూర్యనారాయణ మాట్లాడుతూ బకాయి జీతాలు చెల్లించాలి, సబ్బులు షాంపూలు యూనిఫామ్, తప్పకుండా అంబాసిడర్ కార్మికులకు అందించాలి. సకాలంలో జీతాలు ఎప్పటికప్పుడు అందే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పారు .లేదంటే జిల్లా మొత్తం మీద రాష్ట్ర మొత్తం మీద నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగ భద్రతను కూడా కల్పించాలి. ఈ కార్యక్రమంలో మండల గ్రీన్ అంబాసిడర్ కార్మికులు మరియు నాయకులు పాల్గొన్నారు.