ఫార్మా కంపెనీ ప్రమాదంలో జిల్లావాసి మృతి
విశాఖ పరవాడ సెజ్‌లోని సినర్జిన్ ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడిన విజయనగరం జిల్లావాసి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. వంగర మండలం కోనంగిపాడు గ్రామానికి చెందిన కొవ్వాడ సూర్యనారాయణ పరవాడ సెజ్‌లోని సినర్జిన్ ఫార్మా కంపెనీలో విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 23న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొవ్వాడ సూర్యనారాయణ ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.