మత్యకారుల శాంతియుత దీక్షకు జాతీయ కాంగ్రెస్ మద్దతు

385చూసినవారు
మత్యకారుల శాంతియుత దీక్షకు జాతీయ కాంగ్రెస్ మద్దతు
నక్కపల్లి మండలం 17 వ రోజు కొనసాగు తున్న మత్స్యకారులు మహా శాంతియుత ధర్నాకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వారు కూడా మద్దతు తెలపడం జరిగిందీ. మత్స్య కారులు జీవితాలు నీటి బుడగ లాంటి వని మత్స్య కారులు జీవితాలు తో అడుకోవద్దని హెటిరో యాజమాన్యం వారు ఎటువంటి అనుమతులు లేకుండా కొత్తగా మూడు అడుగులు పైప్ లైన్లు వేయడానికిఅధికారం మీకు ఎవరిచ్చారని మత్స్యకారులు జీవితాలు రాష్ట్ర ప్రభుత్వం కు పట్టదా అని తెలియజెసారు. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజ నాథ్ గారికి కూడా తెలియచేస్తామని ఉద్ఘాటించారు

. 17 రోజుల నుండి పెద్ద ఎత్తున శాంతి యుత పద్దతిలో ధర్నా చేస్తున్న ప్రభుత్వం కాని ప్రభుత్వ యంత్రాంగం కాని ఇంత వరకు స్పందించక పోవడం దురదృష్ట కరమన్నారు. స్తానిక జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిందాక ఒక లాగ వేసిన తరువాత మరోలావ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మత్స్య కారుల సహనాన్ని పరీక్షించ వద్దని మా సహనం హద్దు మీరితే దానికి భాధ్యత మిదేనని హెచ్చరించారు.

కంపెనీలు పెట్టే ముందు ఒక మాట పెట్టిన తరువాత ఒక మాట ఆడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మత్స్యకార జె. ఎ. సి రాష్ట్ర అధ్యక్షులు కంబాల అమ్మో రియ్యా, ఎమ్. అప్పలరాజు, పీక్కి కామేశ్వర రావు, ఆంధ్ర మత్స్యకార జె. ఎ. సి రాష్ట్ర ప్రధనకార్యదర్శి పీక్కి కోదండ రావు, పీక్కి రాంబాబు, చేపల రామకృష్ణ, pపీక్కి గోపి, , ఆంధ్ర మత్స్యకార జె. ఎ. సి రాష్ట్ర విద్యార్ధి ప్రధాన కార్యదర్శి వాసిపిల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :