మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి: అనకాపల్లి ఎంపీ

59చూసినవారు
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి: అనకాపల్లి ఎంపీ
మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా స్వయం సమృద్ధి సాధించాలని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీ. ఎం రమేశ్ సూచించారు. శిక్షణ పొందిన 54 మంది మహిళలకు శనివారం అనకాపల్లిలో ఓఎన్జీసీ వారు సిఎస్ఆర్ నిధులతో కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి అవసరమైన పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్