Mar 10, 2025, 07:03 IST/ఉప్పల్
ఉప్పల్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం పరువు తీస్తున్నాడు
Mar 10, 2025, 07:03 IST
జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నాడని ఓయూ జేఏసి అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ సోమవారం మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేసి సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు.