డి యస్ యన్ ఎల్ యు లో జాతీయ సదస్సు

55చూసినవారు
డి యస్ యన్ ఎల్ యు లో జాతీయ సదస్సు
దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యలయం(డి యస్ యన్ ఎల్ యు )లో సెంటర్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో దేశం లో వ్యాపార బ్యాంకింగ్ ను మెరుగుపరచడం లో న్యాయస్థానాల పాత్ర అనే అంశం పై ఒక రోజు జాతీయ సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఏ వి శేష సాయి హాజరైయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ యువ న్యాయ విద్యార్థులు ట్రయల్ కోర్ట్ లో ముందుగా సాధన చేసి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని మరియు న్యాయవాది వృత్తిలో రాణించాలంటే సీనియర్లని గౌరవిస్తూ వారి అపార అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలని నేటి పరిస్థితులల్లో వ్యాపారాలు, పర్యావరణ వ్యవస్థలకు సంబంధించిన కాంట్రాక్టులు వాటి అమలు వివాద పరిష్కార పక్రియలను అత్యవసరముగా మార్చాల్సిన అవసరం ఉన్నదని తద్వార అన్ని వివాదాల అప్పీళ్ళు విచారణ వేగవంతం అవుతాయాన్నారు. అనంతరం డి యస్ యన్ ఎల్ యు ఉప కులపతి ప్రొఫెసర్ ఎస్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ కమర్షియల్ కోర్టు చట్టం 2015 మరియు కోర్టు సవరణ చట్టం 2018 అమలులోకి రావడం వలన అంతర్జాతీయంగా ఉత్తమ విధానాలను అందిపుచ్చుకున్న దేశంగా భారత్ అవతరించిందన్నారు. ఈ చర్యల వల్ల దేశంలో పెట్టుబడులు పెట్టేటందుకు ఎక్కువ మంది విదేశీయులు ఆకర్షితులవుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమం లో న్యాయమూర్తులు కే పట్టాభి రామారావు, జె సెల్వ నాదన్, రాధ, ఏపీ మాజీ అడ్వకేట్ ఏ సత్య ప్రసాద్, సినియర్ న్యాయవాది ఏం రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్