
గాజువాక: తల్లిపై విచక్షణరహితంగా కొడుకు దాడి
గాజువాకలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు తన తల్లిపై విచక్షణరహితంగా దాడి చేశాడు. అక్కిరెడ్డిపాలెంకి చెందిన సాయికుమార్ (19) తన తల్లి లక్ష్మిని డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో రాయితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కొడుకుని గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.