విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీతో కార్మిక సంఘాలు శనివారం భేటీ అయ్యాయి. కార్మిక సంఘాల నేతలతో సీఎండీ అరుణ్ భక్షీ సంచలన విషయాలు చెప్పారు. స్టీల్ ప్లాంట్ రూ. 2500 కోట్లు నిధులు విడుదల చేశారన్నది అవాస్తవమని తెలిపారు. నిధుల విడుదల అయినట్టు నాకు సమాచారం లేదు. ఢిల్లీలో ఉక్కు శాఖ అధికారులతో జరిగిన చర్చల సారాంశం నేను చెప్పలేను. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నా” అంటూ సీఎండీ స్పష్టం చేశారు.