నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్తవీధిలో ఆదివారం రాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. సర్వసిద్ధి నాగేశ్వరరావు(27) అనే వ్యక్తి ప్రైవేట్ ఎలక్ట్రిషన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు హత్యకు పాల్పడినట్లు తెలిసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు డిఎస్పి మోహన్, టౌన్ సిఐ గోవిందరావు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది