పెందుర్తి మండలం కృష్ణరాయపురంకు చెందిన దుర్గారావుకు పెదనాన్న కొడుకు వరసకు అన్న అయినా చిననూకరాజుతో మంగళవారం ఘర్షణ జరిగింది. దింతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన దుర్గారావు చికిత్స పొందుతూ గురువారం మరణించారు. చిననూకరాజు స్థానిక తెదేపా నాయకుడు నరసింహనాయుడుకు సొంత తమ్ముడని అతడి ప్రోత్సాహంతోనే మరో ముగ్గురితో కలిసి తన అన్నను కొట్టి చంపారని మృతుడి చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్య కేసుగా నమోదు చేశారు.