గతంలో జరిగిన ఉపాధి పథకం నిధుల మళ్లింపుపై విచారణ చేయిస్తున్నామని, అవినీతికి పాల్పడిన వారి వదిలిపెట్టమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్ఆర్‌ఈజీఎస్ ద్వారా రూ.4,500 కోట్లతో 30 వేల పనులు చేపడుతాం. సంక్రాంతి లోపు ఆ పనులు పూర్తి చేస్తాం. జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నాం. సాగు పనులకు ఉపాధి హామీకి అనుసంధానంపై పరిశీలిస్తాం.’ అని అన్నారు.