పెట్రోల్ బంకులో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి (వీడియో)

61చూసినవారు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు‌లో ఊహించని రీతిలో యాక్సిడెంట్ జరిగింది. బైక్‌పై వచ్చిన ఒకతను పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొని చూసుకోకుండా ముందుకు వెళ్లగా అటువైపు నుంచి వచ్చిన ట్రాలీ అతడి పైనుంచి వెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఎమ్మిగనూరు శివారులోని కలుగోట్ల రోడ్డులో ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ఈ ఘటన జరిగింది. యాక్సిడెంట్ దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్