భారత బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం అభియోగాలు నమోదు కావడంపై వైట్ హౌస్ స్పందించింది. అదానీపై నమోదైన కేసు విషయం తమ దృష్టికి వచ్చిందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ పేర్కొన్నారు. ఈ సంక్షోభాన్ని భారత్, అమెరికా దేశాలు అధిగమిస్తాయని తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలు బలంగా ఉన్నాయని, సమస్యను పరిష్కరించుకుంటామని వ్యాఖ్యానించారు.