నరసాపురం నియోజకవర్గంలో ముత్యాలపల్లి మరియు దర్బరేవు గ్రామాలలో "ఇది మంచి ప్రభుత్వం" అనే కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు నరసాపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి తెలిపారు. నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని త్రాగు నీరు సమస్య లేకుండా చేస్తానని తెలిపారు.