విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం తమ ధ్యేయమని వాసవి జూనియర్, డిగ్రీ కళాశాల చైర్మన్ ఎన్వీ. రమణ రావు, ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ అన్నారు. తాడేపల్లిగూడెం జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్, స్కిల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్ సీ ఎల్ సంస్థ గురువారం తాడేపల్లిగూడెం శ్రీవాసవి జూనియర్, డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. 300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.