
తాడేపల్లిగూడెం: కూటమి అభ్యర్థిని గెలిపించాలి
త్వరలో జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని వివిధ కళాశాలలో పట్టభద్రులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం కూటమి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.