నా భర్తను బతికించండి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

64చూసినవారు
నా భర్తను బతికించండి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
భీమవరం పట్నం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆటో కార్మికుడు బూరాడ రాము ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు అమ్మాయి, అబ్బాయి (చిన్న పిల్లలు) సాదాసీదాగా జరుగుతున్న ఆటో కార్మికుడి కుటుంబాన్ని విధి వక్రీకరించింది. దురదృష్టవశాత్తు ఆటో నడుపుతున్న సమయంలో ఆటో తిరగబడి తలకు బలమైన గాయమై భీమవరం వర్మ హాస్పిటల్ లో వైద్యం పొందుతున్నాడు వైద్యులు బ్లడ్ క్లాట్ అయిందని నెల రోజులపాటు హాస్పిటల్లో వైద్యం కోసం ఉంచాలని తెలిపారు. దీంతో దిక్కు తోచని స్థితిలో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబం వైద్యం చేయించుకోలేని పరిస్థితి.
ఓ పక్క హాస్పిటల్లో వైద్యం కోసం కొట్టిమిట్టాడుతూ కనీసం మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో యజమాని, మరోపక్క ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారులతో ఆటో కార్మికుడి భార్య కన్నీరుమున్నీరుగా దాతల సహాయం కోరుతుంది. మనసున్న మారాజులు ముందుకొచ్చి మీ వంతు సహాయ సహకారాలు అందించి నా భర్తను కాపాడండి అంటూ వేడుకుంటూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. ఆమె ఫోన్ పే నెంబర్. 8074387172

సంబంధిత పోస్ట్