ప. గో. జిల్లా బిజెపి అధ్యక్షురాలిగా శ్రీదేవి
పశ్చిమ గోదావరి జిల్లా బిజెపి అధ్యక్షురాలిగా ఐనంపూడి శ్రీదేవి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను ఆకివీడు మండలం బిజెపి నాయకులు చింతా ఆదిశేషు మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆమెకు పూల బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.