నియోజకవర్గంలోని డ్రైన్లు, కాలువలు గుర్రపు డెక్క, తూడు చెత్తలతో నిండిపోయాయని, రైతులు నారుమడులు వేసుకోడానికి ఆందోళన చెందుతున్నారని, వెంటనే పరిష్కార మార్గం చూపాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఇరిగేషన్, డ్రెయినేజీ అధికారులకు సూచించారు. భీమవరంలో ఇరిగేషన్ ఈఈ దక్షిణామూర్తి, డ్రైనేజీ ఈఈ ఎంవివి కిషోర్ తదితర అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. యుద్ద ప్రాతిపదికన పనులు ఎమ్మెల్యే చేపట్టాలన్నారు.