ద్వారకాతిరుమల క్షేత్రానికి వచ్చిన ఓ అయ్యప్ప మాలాధారుడు స్వామిని దర్శించకుండానే గుండెపోటుకు గురై మృతి చెందాడు. అమలాపురం మండలం ఇందుపల్లికి చెందిన కె. సురేష్ అయ్యప్పమాలను ధరించి తన మిత్రులతో కలసి ద్వారకాతిరుమలకి వచ్చారు. ఆదివారం రాత్రి సురేష్ వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్దకు వచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలాడు. స్నేహితులు పిహెచ్సికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.